నేషనల్ బుక్ ట్రస్ట్ (NBT)లో ఎడిటోరియల్ పోస్టులు: తెలుగు భాషా అభ్యర్థులకు మంచి అవకాశం!

నేషనల్ బుక్ ట్రస్ట్ (NBT)లో ఎడిటోరియల్ పోస్టులు: తెలుగు భాషా అభ్యర్థులకు మంచి అవకాశం!

నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్​బీటీ) అసిస్టెంట్ ఎడిటర్, ఎడిటోరియల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్​​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.

పోస్టు పేరు: అసిస్టెంట్ ఎడిటర్, ఎడిటోరియల్ అసిస్టెంట్. 

మొత్తం ఖాళీలు: 17. 

విభాగాల వారీగా ఖాళీలు: అసిస్టెంట్ ఎడిటర్ (ఇంగ్లిష్) 3, అసిస్టెంట్ ఎడిటర్ (ఇంగ్లిష్– కామిక్స్/ గ్రాఫిక్ పుస్తకాలు/ కాఫీ టేబుల్ పుస్తకాలు మొదలైన వాటి కోసం) 1,   ఎడిటోరియల్ అసిస్టెంట్(ఇంగ్లిష్ –  కామిక్స్/ గ్రాఫిక్ పుస్తకాలు/ కాఫీ టేబుల్ పుస్తకాలు మొదలైన వాటి కోసం) 2, ఎడిటోరియల్ అసిస్టెంట్ (మరాఠీ, కన్నడ, గుజరాతీ, మలయాళం, ఒడియా, తెలుగు) 6, ఎడిటోరియల్ అసిస్టెంట్(ఇంగ్లిష్) 5. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) లేదా సంబంధిత భాషలో మాస్టర్స్ డిగ్రీ (ఎంఏ) కలిగి ఉండాలి. ఎడిటోరియల్ అసిస్టెంట్ పోస్టులకు సాధారణంగా 1 నుంచి 2 ఏళ్ల అనుభవం, అసిస్టెంట్ ఎడిటర్ పోస్టులకు 3 నుంచి 4 ఏళ్ల అనుభవం (మ్యానుస్క్రిప్ట్ ఎవాల్యుయేషన్, ప్రూఫ్ రీడింగ్, ఎడిటింగ్) ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 40 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా. 

లాస్ట్ డేట్: ఏప్రిల్ 9.  

సెలెక్షన్ ప్రాసెస్: అవసరాన్ని బట్టి రాత పరీక్ష  లేదా స్కిల్ టెస్ట్‌ నిర్వహించవచ్చు. షార్ట్​లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇందులో అభ్యర్థికి పుస్తక ప్రచురణ రంగంపై ఉన్న అవగాహన, సృజనాత్మకత, కమ్యూనికేషన్ స్కిల్స్​ను పరీక్షిస్తారు. 
ఇంటర్వ్యూలో ఎంపికైన వారు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.nbtindia.gov.inను సందర్శించండి.