రూ.80 లక్షల జీతం.. అమెరికాలో ఇల్లు.. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే.. ఆత్మహత్య చేసుకోవాల్సిన ఖర్మేంటి..?

రూ.80 లక్షల జీతం.. అమెరికాలో ఇల్లు.. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే.. ఆత్మహత్య చేసుకోవాల్సిన ఖర్మేంటి..?

బెంగళూరులో ఒకేరోజు ఆత్మహత్యలకు పాల్పడిన తెలంగాణ సాఫ్ట్వేర్ జంటల కేసు సంచలనంగా మారింది. 2026 మార్చి 31 న ఒకరి వెనుక ఒకరు.. సూసైడ్ కు పాల్పడటం కలకలం రేపింది. ఈ కేసులో బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ చేసిన పోలీసులు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. ఇద్దరూ ఉద్యోగులై ఉండి.. చనిపోవాడానికి కారణమేంటో చెప్పారు. 

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. భాను చందర్ రెడ్డి (32) బెడ్ రూం లాక్ చేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఆ తర్వాత అతని భార్య బీబి షాజియా సిరాజ్ (31) కొన్ని నిమిషాలకే 18వ అంతస్తు నుంచి దూకి చనిపోయింది. 

నైట్ షిఫ్ట్ పూర్తి చేసుకుని ఉదయం 7.30 కు ఇంటికి వచ్చిన షాజియా.. భర్త బెడ్ రూం లాక్ చేసుకుని.. ఎంత కొట్టినా తీయకపోవడంతో భయాందోళనకు గురైంది. వెంటనే సెక్యూరిటీ స్టాఫ్ ను పిలిచింది. డోర్ పగలగొట్టి చూసే సరికి.. చనిపోయిన స్థితిలో ఉన్నాడు. టేబుల్ మీద సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. 

అది చూసిన భార్య షాజియా.. చాలా సేపు షాకింగ్ లోనే ఉండిపోయింది. 20 నిమిషాల  తర్వాత కనిపించడం లేదని చూస్తే.. అప్పటికే 18వ ఫ్లోర్ నుంచి దూకి చనిపోయినట్లు గుర్తించారు. వెంట వెటనే జరిగిన ఈ ఆత్మహత్యలు పోలీసులకు మిస్టరీని మిగల్చాయి. 

రూ.80 లక్షల జీతం:

భాను చందర్ రెడ్డి రాసిన సూసైడ్ నోట్ ప్రకారం.. ఏఐ కారణంగా జాబ్ కోల్పోవడం యాంగ్జైటీ పెంచిందనీ పేర్కొన్నాడు. అతనికి అమెరికాలు ఏడాదికి 80 లక్షల రూపాయల ప్యాకేజ్ వచ్చేదని పోలీసులు తెలిపారు. అమెరికాలో ఇల్లు కూడా కొన్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. అదే విధంగా కుటుంబ సభ్యుల కోసం తెలంగాణలో ఒక ఇల్లు కట్టించాడు భాను. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కారణంగా జాబ్ కోల్పోవడం భాను చందర్ రెడ్డిని తీవ్ర ఆందోళనకు, అభద్రతా భావానికి గురించేసింది. దీనికి తోడు మరో జాబ్ సంపాదించడం కష్టంగా మారింది. అంత ప్యాకేజీ తీసుకున్న అతడు.. అదే రేంజ్ శాలరీతో జాబ్స్ దొరకపోవడం యాంగ్జైటీకి గురిచేసింది. అయినప్పటికీ భార్య, కుటుంబం సపోర్ట్ చేస్తూనే దిగులు పడాల్సిన అవసరం లేదని చెప్తూనే ఉన్నారట. కానీ అంతలోనే దారుణానికి పాల్పడ్డాడు.

షాజియాకు ఐబీఎం (IBM) కంపెనీలో జాబ్ రావడంతో 8 నెలల క్రితమే బెంగళూర్ షిఫ్ట్ అయ్యారు. అమెరికాలో జాబ్  కోల్పోవడంతో ఇండియా వచ్చిన భాను.. కొత్త జాబ్ ట్రయల్స్ లో ఉన్నాడు. 

జరిగింది ఇదే..

2026 మార్చి 29 (ఆదివారం) రాత్రి, హైదరాబాద్ నుంచి బయలుదేరడానికి కొద్దిసేపటి ముందు, షాజియా తన భర్తతో మాట్లాడింది. ఆన్‌లైన్‌లో డిన్నర్ ఆర్డర్ చేశానని, త్వరలో తింటానని ఆమెకు చెప్పాడు. మరి కొద్ది గంటల్లో భర్తను కలుసుకుంటాననే ఆమె ఊహ అంతలోనే ఆవిరై పోయింది. ఆ జంటకు పెళ్లై సుమారు రెండున్నర సంవత్సరాలు అయింది, కానీ పెళ్లైన విషయం భాను ఇంట్లో మాత్రమే తెలుసు. తమ పెళ్లి విషయం షాజియా తన కుటుంబానికి తెలియజేయలేదని పోలీసులు చెప్పారు.

పెళ్లయిన తర్వాత కొన్నాళ్లు  హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ, పెళ్లి గురించి సీక్రెట్ గా ఉంచడం కష్టంగా మారిందని దర్యాప్తు అధికారులు తెలిపారు. దీంతో బెంగళూరుకు వెళ్లి.. తానిసంద్ర మెయిన్ రోడ్డులోని ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో 6వ టవర్ లోని ఎనిమిదో అంతస్తులో నివసిస్తున్నారు. ఏఐ కారణంగా ఉద్యోగం కోల్పోవడంతో నిరాశ నిస్పృహలకు లోనైన భాను.. ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు పోలీసులు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.

ఏఐ టెకీల జీవితాలపై ఎంత ప్రభావం చూపుతోందో చెప్పే ఉదాహరణ ఇది. వీళ్లే కాదు.. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. అలాగని సూసైడ్ చేసుకుంటే ఇక ఎవరూ మిగలరు. అమెరికాలో ఉన్న ఇల్లు అమ్ముకుని ఇక్కడేదైనా బిజినెస్ పెట్టుకున్నా జీవితం ముందుకు సాగేదని వాళ్ల బంధువులు అంటున్నారు. లక్షల్లో సంపాదిస్తున్నా.. ఒడిదుడుకులు ఎదురైనపుడు ఎలా ఎదుర్కోవాలి అనే ఆత్మస్థైర్యం కలిగిప్రస్తుత జనరేషన్ లేకపోవడమే ఇలాంటి అనార్థాలకు కారణం అంటున్నారు నిపుణులు.