Team India: భారత జట్టు టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్.. ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ

Team India: భారత జట్టు టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్.. ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ

Team India: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత జూలైలో ప్రారంభమయ్యే జింబాబ్వే పర్యటనకు భారత పురుషుల టీమ్ వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ని జింబాబ్వే క్రికెట్ బోర్డు 2026, ఏప్రిల్ 1న విడుదల చేసింది. ఈ సిరీస్ జూలై 23న ప్రారంభమై జూలై 26వ తేదీతో ముగియనుంది. అన్ని మ్యాచ్లు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే జరగనున్నాయి. 2024 తర్వాత ఇండియా, జింబాబ్వే మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగనుండడం ఇదే మొదటిసారి. అంతకంటే ముందు టీమిండియా.. ఇంగ్లాండ్, ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లతో పలు వన్డే మ్యాచులు ఆడనుంది. అంతేకాకుండా జింబాబ్వే పర్యటన ముగిసిన వెంటనే శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ లో కూడా ఇండియన్ టీమ్ తలపడనుంది. 

ఈ వరుస సిరీస్ లతో ఐర్లాండ్, జింబాబ్వే పర్యటనలకు సీనియర్ ప్లేయర్స్ కి విశ్రాంతి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ రెండు సిరీస్ లకి వైభవ్ సూర్యవంశీ, అయూశ్ మాత్రే లాంటి యంగ్ ప్లేయర్స్ కి చోటు దక్కేందుకు అవకాశం ఉంది. ఐపీఎల్-2026లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచే యంగ్ క్రికెటర్లను కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి మాత్రం భారత సీనియర్ జట్టు తరపున పిలుపు రావడం దాదాపు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. 

మరోవైపు గత కొంతకాలంగా కేవలం వన్డేలకే పరిమితమైన శ్రేయస్ అయ్యర్ తిరిగి టీ20 జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన తర్వాత భారత జట్టు టీ20 రెగ్యులర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిరిగి స్వదేశానికి వచ్చే ఛాన్స్ ఉంది. సూర్య ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అతడ్ని కీలక సిరీస్ లలోనే ఆడించాలని బీసీసీఐ యోచిస్తుంది. దీంతో.. ఐర్లాండ్ లేదా జింబాబ్వే టూర్ లకి భారత జట్టు పగ్గాలను శ్రేయస్ చేపట్టే ఛాన్స్ ఉందని క్రికెట్ నిపుణులు పేర్కొంటున్నారు. రెండేళ్ల కిందట టీమిండియా తరపున శ్రేయస్ టీ20ల్లో ఆడాడు. లక్నో స్పీడ్ స్టార్ యయాంక్ యాదవ్ కూడా తిరిగి టీ20 జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ టీమ్ చూస్తుంది.