ఈతకు వెళ్లి బాలుడు మృతి..భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన

ఈతకు వెళ్లి బాలుడు మృతి..భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన

గుండాల, వెలుగు: వాగులో ఈత కొట్టేందుకు వెళ్లి ఓ బాలుడు మృతిచెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం నరసాపురం తండాకు చెందిన గుగులోత్ కల్పన, దేవ దంపతుల కొడుకు సీమాన్(12) ఇల్లందు స్కూల్​లో ఐదో తరగతి చదువుతున్నాడు. గురువారం తండాలో దుర్గమ్మ పండుగ జరిగింది. 

తన స్నేహితులు పండు, ఋషితో కలిసి సరాదాగా ఈత కొట్టేందుకు ఊరు సమీపంలోని మల్లన్న వాగుకు వెళ్లాడు. సీమాన్, పండు వాగులోకి దిగగా, ఋషి ఒడ్డునే ఉన్నాడు. కొద్దిసేపటికే సీమాన్ నీటిలో గల్లంతయ్యాడు. గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని గాలించగా సీమాన్ మృతదేహం లభ్యమైంది. పండుగ వేళ బాలుడు మృతిచెందడంతో తండాలో తీవ్ర విషాదం నెలకొంది.