- పగిలిన పైకప్పు హైదర్ నగర్ పరిధిలో ఘటన
మూసాపేట, వెలుగు : కార్ల షోరూంలో అగ్ని ప్రమాదం జరిగిన ఘటన కూకట్ పల్లి సర్కిల్ పరిధి హైదర్ నగర్ చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జేమ్స్ మారుతి కార్ల షో రూంలోని వర్క్ షాపు పెయింటింగ్విభాగంలో ఒక్కసారిగా కాంప్రెషర్ పేలింది. ప్రమాదం ధాటికి షోరూం వర్క్ షాపు పై కప్పులు పగిలిపోయాయి.
ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. షోరూంలోని సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అప్రమత్తమైన సిబ్బంది ఇతర ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా ఆర్పే ప్రయత్నం చేశారు. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలని ఆర్పివేసింది. దాదాపు 10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టుగా యాజమాన్యం అంచనా వేసింది.
