హైదరాబాద్ సిటీలో దోమల నివారణ కోసం శాస్వత ప్రయత్నాల్లో ఉన్న ప్రభుత్వం.. అందులో భాగంగా జర్మన్ టెక్నాలజీతో నడిచే ఫాగింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. శుక్రవారం (ఏప్రిల్ 10) మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎల్‌బీ నగర్ సర్కిల్ కార్యాలయంలో ఆధునిక ఫాగింగ్ యంత్రాలను ప్రారంభించారు. తొలి దశలో 10 ఫాగింగ్ యూనిట్లు అందుబాటులోకి తెచ్చారు.
ఎలక్ట్రిక్ ఆటోల్లో ఫాగింగ్ యంత్రాల ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, చైర్మన్ కాసుల బాలరాజ్ చేతుల మీదుగా యంత్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. దోమల నియంత్రణను వేగవంతం చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. జర్మన్ సాంకేతికతతో రూపొందించిన అధునాతన యంత్రాలు ఒక్కసారి ఆపరేషన్‌లో 150 కిలోమీటర్ల పరిధి కవరేజ్ ఉంటుందన్నారు. 6 గంటలకు పైగా నిరంతరంగా పనిచేసే సామర్థ్యం కలిగిఉన్నట్లు చెప్పారు.
►ALSO READ | రెండేళ్లలో 761 మావోయిస్టులు లొంగుబాటు: DGP శివధర్ రెడ్డి
WHO, BSI గుర్తింపు పొందిన ఫాగింగ్ యంత్రాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. 3–6 నెలల్లో దోమల నిర్మూలన సాధ్యమని ఈ సందర్భంగా అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఎల్‌బీ నగర్, సరూర్ నగర్ సర్కిళ్లలో తొలి దశలో అమలు చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో 74 వార్డులకు విస్తరణ ప్రణాళిక అమలు చేయనున్నట్లు తెలిపారు.
ఫిర్యాదు పరిష్కార వ్యవస్థతో యంత్రాల అనుసంధానం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ – వినియోగం, భద్రతపై అవగాహన కల్పిస్తామని అన్నారు. పర్యావరణ హితం కోసం ఈవీ వాహనాల వినియోగిస్తున్నట్లు చెప్పారు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో ఫాగింగ్ సౌకర్యం, కాలుష్య రహిత వాహనాల ప్రోత్సాహానికి మరో ముందడుగు పడినట్లు తెలిపారు.
