సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.. మంగళవారం ( జులై 21 ) తెల్లవారుజామున స్కార్పియో కారు బోల్తా పడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నిజాంపేట మండలం బాచేపల్లి దగ్గర నేషనల్ హైవే 161 పై జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...
మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి ఓ కుటుంబం స్కార్పియోలో హైదరాబాద్ కు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఓ బైక్ ను తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ కంట్రోల్ కోల్పోవడంతో కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో బార్యాభర్తలతో పాటు నాలుగేళ్ళ కుమార్తె అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
