యూపీలో ఘోరం: యమునా నదిలో పడవ బోల్తా.. 10 మంది మృతి 

యూపీలో ఘోరం: యమునా నదిలో పడవ బోల్తా.. 10 మంది మృతి 

యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. యమునా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 10 మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. శుక్రవారం ( ఏప్రిల్ 10 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో కేశీఘాట్ దగ్గర యమునా నదిలో సుమారు 25 నుంచి 30 మంది యాత్రికులతో వెళుతున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది మరణించగా మరికొందరు గల్లంతైనట్లు తెలుస్తోంది.

బృందావన్‌లోని పంటూన్ బ్రిడ్జి దగ్గర రద్దీగా ఉన్న పడవ బోల్తా పడటం కలకలం రేపింది. సమాచారం అందుకున్న డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 14 మందిని రక్షించగా.. ఇంకా 12 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. గల్లంతైన వారికోసం గాలింపు ముమ్మరం చేశారు.

పంజాబ్ నుంచి వచ్చిన యాత్రికులు యమునా నదిని సందర్శిస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3:15 గంటల ప్రాంతంలో యమునా నదిపై ఉన్న పాంటూన్ బ్రిడ్జి దగ్గర పడవ ప్రమాదం జరిగిందని తెలిపారు పోలీసులు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో సుమారు 25-27 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు.

►ALSO READ | EV కారుకు పొల్యూషన్ చలానా : భాస్కర్ అవార్డుకు అర్హులు సార్ మీరు..!

 పడవ పాంటూన్ బ్రిడ్జిని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 10 మృతదేహాలను వెలికితీశామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు పోలీసులు.