పనిలేనోడు కోడిగుడ్డు పైన ఈకలు పీకాలని ప్రయత్నించాడట.. అట్లుంది ఈ యవ్వారం. లేకపోతే.. ఈవీ కారేంటి.. పొల్యుషన్ సర్టిఫికేట్ఏంటి..? డ్రైవర్ పై కోపంతో పొల్యుషన్ సర్టిఫికేట్ లేదని చలానా వేస్తే జనాలు నవ్వరా మరి. పొల్యుషన్ అవసరం లేని కారుకు 1500 ఫైన్ విదించడం చర్చనీయాంశంగా మారింది. అందుకే ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని నగౌర్ లో జరిగింది ఈ ఘటన. టాటా టియాగో ఈవీ కార్ లో సన్ షేడ్స్ వినియోగిస్తున్నందుకు కారును ఆపాడు ఏఎస్ఐ (ASI). ఈ విషయంలో ఇద్దరికీ తీవ్ర వాగ్వాదం జరిగింది. సన్ షేడ్స్ వాడుతున్నందుకు మొదట 200 రూపాయల ఫైన్ విధించాడు ఏఎస్ఐ. అదే విధంగా తనతో వాగ్వాదం పెట్టుకున్న కోపంతో అదనంగా పొల్యుషన్ సర్టిఫికేట్ లేదని ఫైన్ విధించాడు.
పొల్యుషన్ సర్టిఫికేట్ లేదని ఫైన్ వేయడంపై కార్ ఓనర్ ఎంత వాదించినా ఏఎస్ఐ వినలేదు. ఈవీ కార్లకు పొల్యుషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికేట్ అవసరం లేదని చెప్పినా.. ఫైన్ వేశాడు.
- పోలీస్ శాఖ రియాక్షన్:
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వివాదం రాజస్థాన్ పోలీసు శాఖకు చేరింది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు.. కార్ విండో షేడ్స్ తొలగించాలని ఏఎస్ఐ చెప్పినప్పుడు ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. అందుకే ఫైన్ వేశాడు. అది ఓకే. కానీ.. పొల్యుషన్ సర్టిఫికేట్ విషయంలో చలానా వేయటం కరెక్ట్ కాదు. ఆ జరిమానాను క్యాన్సిల్ చేస్తాం. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
►ALSO READ | నల్లగా ఉన్నాడని భర్తను చంపిన భార్య : లవర్ తో కలిసి ఇంట్లోనే ఫినిష్ చేసింది..!
ఈవీ వాహనాలకు పొల్యుషన్ అవసరమా..?
సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ (CMVR) 1989 ప్రకారం బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), టెయిల్‌పైప్ నుండి జీరో ఎమిషన్ (ఉద్గారాల)ను విడుదల చేస్తాయి. అంటే ఎలాంటి పొగ విడుదల కాదు. దీంతో ఈవీ వాహణాలు ప్రామాణిక PUC పరీక్ష నుంచి మినహాయిస్తారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ప్రకారం, బ్యాటరీతో నడిచే వాహనాలను కాలానుగుణ PUC తనిఖీలు లేకుండా నడపవచ్చు. PUC సర్టిఫికేట్ కేవలం ఇంధనాలతో నడిచే వాహనాలకు అవసరం. ఇది వాహనాల వల్ల కలిగే వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి తీసుకున్న ఒక చర్య మాత్రమే.
गजब का सिस्टम है भाई.. 🤗🤗
— Shiksha News Rajasthan (@ShikshaNewsRaj1) April 8, 2026
जब टारगेट पूरा करना हो, तो EV क्या... साइकिल का भी PUC कट सकता है..!!
विज्ञान अपनी जगह, पर चालान अपनी जगह.!!🙌
सिस्टम को सलाम.!!! 🫡 pic.twitter.com/fVRNWWwKSX
