
శామీర్ పేట, వెలుగు: మహిళా ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధించిన జూనియర్ అసిస్టెంట్ పై కేసు నమోదైంది. శామీర్ పేట పోలీసులు తెలిపిన ప్రకారం.. మేడ్చల్ కలెక్టరేట్ లో అసిస్టెంట్ కమిషనర్ లేబర్ ఆఫీసులో అజయ్ జూనియర్ అసిస్టెంట్. కాగా అదే ఆఫీసులో మరో విభాగంలో ఓ మహిళ జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తోంది. ఆమెను ప్రేమిస్తున్నానంటూ అజయ్ కొంతకాలంగా వేధిస్తున్నాడు. దీంతో మహిళ ఈనెల 25న పోలీసులకు కంప్లయింట్ చేయగా మంగళవారం కేసు నమోదు చేశారు.