
హైదరాబాద్: క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో కేఎల్ హెచ్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ విద్యార్థులు మంచి ప్యాకేజీలతో జాబులు సాధించారని ఆ వర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ఆకెళ్ల రామకృష్ణ తెలిపారు. బుధవారం ఆయన హైదరాబాద్ లోని కేఎల్ హెచ్ వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది 75 లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీతో తమ విద్యార్థి ప్లేస్‌మెంట్ సాధించారని తెలిపారు. 20 నుంచి 50 లక్షల రూపాయలలోపు వార్షిక ప్యాకేజీతో సూపర్ డ్రీమ్, డ్రీమ్ కంపెనీలలో తమ స్టుడెంట్లు ప్లేస్ అయ్యారని చెప్పారు.
జర్మనీ, జపాన్, సింగపూర్, దుబాయ్, మలేషియా వంటి దేశాల్లో ప్లేస్‌మెంట్స్ దక్కించుకున్నారని తెలియజేశారు. కేఎల్ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలలో ఇంటర్న్ షిప్ కూడా చేస్తున్నారని చెప్పారు. కోర్ కంపెనీ ప్లేస్‌మెంట్స్ లలో కూడా తమ విద్యార్థులు ప్రతిభ కనబరచి ప్లేస్‌మెంట్స్ పొందటం విశేషమన్నారు.