నాలుగేండ్ల ఫీజు బకాయిలు చెల్లించాలి : ఎంపీ ఆర్.కృష్ణయ్య

నాలుగేండ్ల ఫీజు బకాయిలు చెల్లించాలి : ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: నాలుగేండ్లుగా పెండింగ్​ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలను ప్రభుత్వం వెంటనే  చెల్లించాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య కోరారు. ఆదివారం విద్యానగర్ బీసీ భవన్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ ఆధ్వర్యంలో బీసీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. జాతీయ కో ఆర్డినేటర్ ర్యాగ అరుణ్ కుమార్ తో కలిసి ఎంపీ హాజరై మాట్లాడారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడం విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.

 కనీసం హాస్టళ్లకు కరెంట్​ బిల్లు కూడా కట్టడం లేదని, విద్యార్థులు ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని కాలేజీ యాజమాన్యాలకు, హాస్టళ్లకు, విద్యార్థులకు పెండింగ్ ఉన్న బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కంచిగారి ప్రవీణ్ కుమార్ ను నియమించారు. నాయకులు నీల వెంకటేశ్, రాజ్ కుమార్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.