పద్మారావునగర్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పార్టీ సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఆదం సంతోష్‌కుమార్ తెలిపారు. చిలకలగూడ జీహెచ్‌ఎంసీ పార్కులో షటిల్ బాడ్మింటన్ కోర్టులను ఆదివారం ఆయన ప్రారంభించారు.
నగరంలో క్రీడామైదానాల ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం ఆయనను చిలకలగూడ పార్క్వాకర్స్ డెవలప్‌మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటీ, సికింద్రాబాద్ షటిల్ రైడర్స్ ప్రతినిధులు, క్రీడాకారులు సన్మానించారు. నాయకులు జలంధర్‌రెడ్డి, అనిల్, శిల్పాచారి, కృష్ణ, వహీదుద్థీన్, జగదీశ్వర్‌రావు, అమర్నాథ్, రవిశంకర్, వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు బాలరాజు, అనిల్ బెన్‌హర్, రఘునందన్, రాజీవ్, ఉమాకాంత్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
