భోపాల్: మధ్యప్రదేశ్లో రవాణా చెక్ పోస్టులకు ప్రభుత్వం గతేడాదే గుడ్ బై చెప్పినప్పటికీ రాష్ట్ర సరిహద్దు పాయింట్ల వద్ద రవాణా సిబ్బంది, దళారులు దోపిడీకి పాల్పడుతునే ఉన్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, గుజరాత్ సరిహద్దుల గుండా ప్రయాణించే ట్రక్ డ్రైవర్లు ఈ దళారుల బెడదను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలో రేవా జిల్లాలో శనివారం జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ట్రక్కు డ్రైవర్ సుమిత్ పటేల్ రేవా వైపు వెళ్తుండగా హనుమాన ఆర్టీవో చెక్ పోస్టు సమీపంలో ఒక దళారీ అతడి వాహనాన్ని ఆపాడు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్, తనిఖీల పేరుతో డ్రైవర్ను బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడు. సుమిత్ నిరాకరించడంతో ఆ దళారీ బలవంతంగా ట్రక్కు ఎక్కాడు. వేధింపులకు భయపడిన సుమిత్ ట్రక్కును ముందుకు పరిగెత్తించాడు. దాదాపుగా 5 కిలోమీటర్ల దూరం వెళ్లాక సుమిత్ వాహనాన్ని ఆపడంతో ఆ దళారీ దిగిపోయాడు.
