శంబాల ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేసిన హీరో నాని

శంబాల ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేసిన హీరో  నాని

ఆది సాయికుమార్,  అర్చ నా అయ్యర్ జంటగా   యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్‌‌‌‌ అన్న భీమోజు, మహిధర్ రెడ్డి నిర్మించిన  చిత్రం ‘శంబాల’. డిసెంబర్ 25న సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేసిన హీరో  నాని మాట్లాడుతూ ‘ట్రైలర్ చాలా ప్రామిసింగ్‌‌‌‌గా  ఉంది.  ఇలాంటి జానర్ చిత్రాల్నే ఆడియెన్స్ ఇప్పుడు కోరుకుంటున్నారు.  

బ్యాక్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌లో వచ్చే ఇంగ్లీష్ సాంగ్  స్టైలీష్‌‌‌‌గా ఉంది. ఆది  మంచి నటుడు, మంచి డ్యాన్సర్. ఈ చిత్రంతో తనకు  మంచి విజయం దక్కాలి’ అని టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్  చెప్పాడు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ఆకాశం నుంచి ఓ ఉల్క పడటంతో  మొదలైంది.  ‘పంచభూతాల్ని శాసిస్తుందంటే ఇది సాధారణమైనది కాదు’.. అనే డైలాగ్‌‌‌‌తో ఆ ఉల్క శక్తిని చూపించారు.

  ఊర్లో అందరూ వింతగా ప్రవర్తిస్తుండటం, ఆ ఉల్కను కట్టడి చేసేందుకు పూజలు చేయడం, మఠాధిపీఠాల్ని తీసుకురావడం చూపించారు.  ఈ మిస్టరీని ఛేదించేందుకు నాస్తికుడైన హీరో రంగంలోకి దిగి ఏం చేస్తాడనేది ఆసక్తిరేపేలా ట్రైలర్ కట్ చేశారు. శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్‌‌‌‌గ్రౌండ్ స్కోరు ఆకట్టుకుంది.