వికారాబాద్ జిల్లాలో అదుపుతప్పి స్క్రాప్ డీసీఎం బోల్తా

వికారాబాద్ జిల్లాలో అదుపుతప్పి స్క్రాప్ డీసీఎం బోల్తా
  • తృటిలో తప్పించుకున్న చిన్నారి
  • తుక్కు తుక్కైన ఆటో, 4 బైక్​లు 
  • వికారాబాద్ జిల్లాలో ప్రమాదం

పరిగి, వెలుగు: స్క్రాప్​ డీసీఎం స్పీడ్ గా వెళ్తూ అదుపు తప్పి బోల్తా పడడంతో ఆటోతో పాటు బైక్​లు తుక్కుతుక్కయ్యాయి. అయితే, ఘటన జరిగినప్పుడు ఓ చికెన్ ​సెంటర్​ ముందు నిలబడిన చిన్నారి  త్రుటిలో ప్రాణాలు దక్కించుకుంది. వికారాబాద్ ​జిల్లా పరిగి మున్సిపల్​పరిధిలోని బహార్​పేట్ ​వీరభద్ర కిరాణ షాపు వద్ద ఆదివారం ఉదయం ఘటన జరిగింది. ​స్క్రాప్​ డీసీఎం ( ఏపీ 22 టీఏ 5004)  ఓవర్​స్పీడ్​తో కొడంగల్​ చౌరస్తా నుంచి హైదరాబాద్​ వైపు వస్తోంది. 

బహార్​పేట్ ​లిమ్రా హోటల్​ వద్దకు  రాగానే అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో డీసీఎంలోని స్క్రాప్ అంతా పార్క్​ చేసిన ఆటోతో పాటు 4 బైక్ లపై పడిపోయింది.  పక్కనే చికెన్​షాపు ఎదుట నిలబడిన చిన్నారిని తప్పిస్తూ వెళ్లగా జాలి ఆమెపై కూడా పడిపోగా.. స్థానికులు వెంటనే స్పందించి కాపాడారు. ఘటన సీసీ టీవీ కెమెరాలో రికార్డైంది.  ప్రమాదం జరిగిన తర్వాత డీసీఎం డ్రైవర్​ను బయటికి తీశారు. డ్రైవర్​ మద్యం తాగి  స్పీడ్ గా  నడపడంతోనే  ప్రమాదం జరిగిందని తెలిసింది. ఫైర్​, పోలీసులు క్రేన్ సాయంతో స్క్రాప్ ను  తొలగించి రోడ్డును  క్లియర్​ చేశారు.  డీసీఎం  డ్రైవర్​పై  కేసు నమోదు చేసినట్టు పరిగి ఎస్ఐ మోహన్ కృష్ణ తెలిపారు.