ప్రభుత్వ ఈ-మార్కెట్‌‌‌‌ప్లేస్ జీఈఎంలో.. రూ.2వేల200 కోట్ల పాత వస్తువులు అమ్మకం

ప్రభుత్వ ఈ-మార్కెట్‌‌‌‌ప్లేస్ జీఈఎంలో.. రూ.2వేల200 కోట్ల పాత వస్తువులు అమ్మకం
  • గత నాలుగేళ్లలో సంపాదించిన ప్రభుత్వ డిపార్ట్‌‌‌‌మెంట్లు, సంస్థలు

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఈ-–మార్కెట్‌‌‌‌ప్లేస్ (జీఈఎం) ద్వారా గవర్నమెంట్ డిపార్ట్‌‌‌‌మెంట్లు, సంస్థలు   స్క్రాప్, ఈ–-వేస్ట్, పాత వాహనాలు, యంత్రాలు, లీజ్‌‌‌‌హోల్డ్ ప్రాపర్టీలు వంటి ఆస్తులు అమ్మి గత నాలుగేళ్లలో  రూ.2,200 కోట్లు సంపాదించాయి. 

ఈ కాలంలో 13 వేల ఆక్సన్లు, 23 వేల రిజిస్టర్డ్ బిడ్డర్లు, 17 వేల ఆక్సనర్లు పాల్గొన్నారు. ఉదా. ఎస్‌‌‌‌బీఐ లక్నోలో 100 ఎకనామిక్ వీకర్ సెక్షన్(ఈడబ్ల్యూఎస్‌‌‌‌) ఫ్లాట్లను వేలం వేసి రూ.34.53 కోట్లు పొందింది. ఇతర వేలాల్లో నేషనల్ జూలాజికల్ పార్క్ పాత వస్తువులు ఈ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లో అమ్మగా,  ఎఫ్‌‌‌‌సీఐ అరావలి జిప్సం రూ.3.35 కోట్ల విలువైన విలువైన జిప్సంను విక్రయించింది.  

 చిన్న కంపెనీలకు మేలు..

జీఈఎం ద్వారా 11.25 లక్షలకుపైగా సూక్ష్మ, చిన్న వ్యాపారాలు (ఎంఎస్‌‌‌‌ఈలు)  రూ.7.44 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆర్డర్లు పొందాయి.  2025 నవంబర్ నాటికి, ఎంఎస్‌‌‌‌ఈలు జీఈఎంలో జరిగిన మొత్తం లావాదేవీలలో 44.8శాతం వాటా సాధించాయి. ఇది చిన్న వ్యాపారాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన 25శాతం టార్గెట్ కంటే చాలా ఎక్కువ. జీఈఎం ద్వారా ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు సరుకులు, సేవలను సెల్లర్ల నుంచి కొనుగోలు చేస్తాయి.