- ఇక ఏఐతో వ్యాపార కార్యకలాపాలు
- 2026 నుంచి ఏజెంటిక్ ఏఐ యుగం మొదలవుతుంది: విప్రో సీటీఓ సంధ్య
న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో ప్రపంచ టెక్నాలజీ రంగం ఏజెంటిక్ ఏఐ యుగంలోకి అడుగుపెడుతుందని విప్రో సీటీఓ సంధ్యా అరుణ్ అభిప్రాయపడ్డారు. 2025లో జనరేటివ్ ఏఐ భారీగా విస్తరించగా, 2026లో వాపార కార్యకలాపాల్లో ఏఐ నేరుగా భాగమవుతుందని తెలిపారు. జనరేటివ్ ఏఐ కొత్త కంటెంట్ (టెక్స్ట్, ఇమేజ్, వీడియో, కోడ్) సృష్టిస్తుంది.
ఏజెంటిక్ ఏఐ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని పనులను పూర్తి చేస్తుంది. ‘‘ఐటీ, హెచ్‌ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్, సప్లయ్ చెయిన్ వంటి విభాగాల్లో సహకరించే ఏఐ ఏజెంట్ నెట్‌వర్క్‌లు, క్లిష్టమైన వర్క్‌ఫ్లోలను నిర్వహిస్తాయి”అని సంధ్య తెలిపారు. మనుషుల పాత్ర కూడా మారుతుందని, అమలు చేసే రోల్స్ నుంచి వెనకుండి నడిపే రోల్స్‌కి షిఫ్ట్ అవుతుంది అన్నారు.
విస్తృతమైన జనరల్ మోడళ్లకు బదులుగా డొమైన్ -స్పెసిఫిక్, ఇండస్ట్రీ-నేటివ్ మోడళ్లు ప్రాధాన్యం పొందుతాయని, ఇవి ప్రత్యేక డేటాసెట్‌లపై శిక్షణ పొంది, రిస్క్ కంట్రోల్స్, సేఫ్టీ, రెగ్యులేటరీ అవసరాలను ముందుగానే కలుపుకుంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. చిన్న, ఫోకస్డ్ మోడళ్లు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఖచ్చితత్వాన్ని ఇస్తాయన్నారు.
