ముగిసిన టెట్ దరఖాస్తు గడువు

ముగిసిన టెట్ దరఖాస్తు గడువు
  • రెండు పేపర్లకు1.65 లక్షల అప్లికేషన్లు 

హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తు గడువు బుధవారం రాత్రితో ముగిసింది. రాత్రి 10గంటల వరకు 1,65,161 దరఖాస్తులు అందాయి. పేపర్– 1కు 46,375, పేపర్ 2కు 1,02,724 అప్లికేషన్లు రాగా, రెండు పేపర్లకు 16,062 వచ్చాయి. అయితే, టెట్ కు 1,66,411మంది ఫీజు చెల్లించారు. మరో పక్క 6,988 మంది దరఖాస్తులను ఎడిట్ చేసుకున్నారు. ఏప్రిల్15 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే.