ఏపీపీ ఎగ్జామ్ ప్రిలిమినరీ కీ రిలీజ్

ఏపీపీ ఎగ్జామ్ ప్రిలిమినరీ కీ రిలీజ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా118 అసిస్టెంట్‌‌‌‌ పబ్లిక్‌‌‌‌ ప్రాసిక్యూటర్‌‌‌‌ (ఏపీపీ) పోస్టుల భర్తీ కోసం ఈ నెల 14న నిర్వహించిన పేపర్‌‌‌‌-1 (ఆబ్జెక్టివ్‌‌‌‌) పరీక్ష ప్రిలిమినరీ కీ విడులైంది. రిక్రూట్మెంట్‌‌‌‌ బోర్డు అధికారిక వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ ‘www.tgprb.in’ లో ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి కీ అందుబాటులో ఉంటుందని తెలంగాణ పోలీస్‌‌‌‌ రిక్రూట్మెంట్‌‌‌‌ బోర్డు (టీజీఎల్పీఆర్బీ) చైర్మన్‌‌‌‌ వీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. 

అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రతి ప్రశ్నకు వేర్వేరుగా వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో సూచించిన టెంప్లేట్స్‌‌‌‌ మాదిరిగా తగిన ఆధారాలతో కలిపి తమ లాగిన్‌‌‌‌ ఐడీ ద్వారా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఈ నెల 24 సాయంత్రం 5 గంటల లోపు బోర్డుకు పంపాలన్నారు.

 ప్రతి అభ్యంతరానికి రూ.500 చెల్లించాలని సూచించారు. ప్రతి ప్రశ్నపై అభ్యంతరాన్ని వేర్వేరుగా నమోదు చేయాలని, అభ్యర్థులు పంపిన అభ్యంతరాలు సరైనవి అయితే వారు చెల్లించిన రూ.500 రీఫండ్‌‌‌‌ చేస్తామని చెప్పారు. అసమగ్రంగా, సరైన సమాచారం లేకుండా పెట్టే అభ్యర్థనలను స్వీకరించబోమని, అదేవిధంగా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో మినహా రాతపూర్వకంగా ఇచ్చే అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు.