ఖానాపూర్, వెలుగు: అమృత్ 2.0 పథకం కింద ఖానాపూర్ పట్టణంలోని రెంకొని వాగు సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని బీజేపీ నాయకులు ఆరోపించారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా జరుగుతున్న పనులను ఆదివారం బీజేపీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న నిర్మాణ పనుల వద్ద సంబంధిత శాఖ అధికారులు కనీసం బోర్డులు కూడా పెట్టకపోవడం దారుణమన్నారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీరు అందించేందుకు మోదీ సర్కార్ రూ.వేల కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. ప్రతి రోజు ఆధికారులు పర్యవేక్షించి పనులు సక్రమంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఆకుల శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ అంకం మహేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, పట్టణ, మండల అధ్యక్షులు కీర్తి మనోజ్, యు.ఉపేందర్తదితరులు పాల్గొన్నారు.
