డి.పోచంపల్లి లైన్ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్

డి.పోచంపల్లి  లైన్ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్

జీడిమెట్ల, వెలుగు: డి.పోచంపల్లి విద్యుత్​సెక్షన్ లైన్​ఇన్​స్పెక్టర్ వి.హరికృష్ణరాజుపై సస్పెన్షన్​వేటు పడింది. జీడిమెట్ల డీఈ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. డి.పోచంపల్లి సెక్షన్​పరిధిలో ఇటీవల బస్తీబాట కార్యక్రమం నిర్వహించగా ఛీప్ ఇంజినీర్​హాజరయ్యారు. ఆ సమయంలో ఎల్​టీ నెట్​వర్క్ ప్రపోజ్ చేయకుండా విద్యుత్​స్తంభాలను ఏర్పాటు చేయకుండానే పెద్ద ఎత్తున విద్యుత్​సర్వీసులను జారీ చేసినట్లు గుర్తించారు.

 సీఈ ఆదేశాలతో విచారణ జరిపిన అధికారులు లైన్​ఇన్​స్పెక్టర్​హరికృష్ణరాజు విధుల్లో నిర్లక్ష్యం వహించి సంస్థకు నష్టం వచ్చేలా చేయడంతోపాటు అక్రమాలకు పాల్పడినట్లు తేల్చారు. దీంతో ఆయనను సస్పెండ్​చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈ లైన్​ఇన్​స్పెక్టర్​విద్యుత్​కాంట్రాక్టర్​గా వర్క్​చేస్తారని, ఆయనకు వర్క్​ఇవ్వని వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు ఆరోపణలున్నాయి. ఏకంగా ప్యానల్​బోర్డు కంపెనీ ఏర్పాటు చేసినట్లు 
సమాచారం.