బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల జాతర.. డిగ్రీ పాసైతే చాలు.. నిరుద్యోగులకు మంచి ఛాన్స్..

 బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల జాతర.. డిగ్రీ పాసైతే చాలు..  నిరుద్యోగులకు మంచి ఛాన్స్..

బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి,  అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు. 

పోస్టుల సంఖ్య: 514.

ఖాళీల వివరాలు: క్రెడిట్ ఆఫీసర్ ఎంఎంజీఎస్-II  418, క్రెడిట్ ఆఫీసర్ ఎంఎంజీఎస్-III 60, క్రెడిట్ ఆఫీసర్ ఎస్ఎంజీఎస్IV 36.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ (ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పీడబ్ల్యూబీడీ) అభ్యర్థులకు 5 శాతం మార్కుల సడలింపు (కనీసం 55 శాతం అవసరం) ఉంటుంది.

వయోపరిమితి (-2025, నవంబర్ 1 నాటికి)
క్రెడిట్ ఆఫీసర్ ఎంఎంజీఎస్-II: 25 నుంచి 35 ఏండ్ల మధ్యలో ఉండాలి.
క్రెడిట్ ఆఫీసర్ ఎంఎంజీఎస్-III: 28 నుంచి 38 ఏండ్ల మధ్యలో ఉండాలి.
క్రెడిట్ ఆఫీసర్ ఎస్ఎంజీఎస్–IV:  30 నుంచి 40 ఏండ్ల మధ్యలో ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

అప్లికేషన్లు ప్రారంభం: డిసెంబర్ 20.

లాస్ట్ డేట్: జనవరి 05.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.175. ఇతరులకు రూ. 850. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, ఆన్​లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు bankofindia.bank.in వెబ్​సైట్​ను సందర్శించండి.

ఆన్‌లైన్ ఎగ్జామ్: ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు 25 మార్కులకు(ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే), రీజనింగ్ 25 ప్రశ్నలు 25 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 25 మార్కులకు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ 75 ప్రశ్నలు 75 మార్కులకు ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలు 150 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది.

కనీస అర్హత మార్కులు (ఆన్‌లైన్ పరీక్ష): జనరల్/ఈడబ్ల్యూఎస్‌కు 35 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పీడబ్ల్యూబీడీలకు 30 శాతం మార్కులు.

నెగెటివ్ మార్క్స్: ప్రతి తప్పుడు సమాధానానికి 1/4వ వంతు మార్కులు కోత విధిస్తారు. 

వ్యక్తిగత ఇంటర్వ్యూ: ఖాళీల సంఖ్యకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.100 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. కనీస అర్హత మార్కులు జనరల్/ ఈడబ్ల్యూఎస్‌కు 50 శాతం ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పీడబ్ల్యూడీలు 45 శాతం మార్కులు సాధించాలి.

ఫైనల్ సెలెక్షన్: ఆన్‌లైన్ పరీక్ష 70 శాతం, ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ ఉంటుంది.

►ALSO READ | తెలంగాణ చరిత్ర, సంస్కృతి.. పెంబర్తి హస్తకళలు..చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్