ముంబైలో నేపాల్ క్రికెట్ ఫీవర్: రూ.250 టికెట్ రూ.500 పైనే.. బ్లాక్ మార్కెట్ జోరు!

ముంబైలో నేపాల్ క్రికెట్ ఫీవర్: రూ.250 టికెట్ రూ.500 పైనే.. బ్లాక్ మార్కెట్ జోరు!

ముంబైలోని వాంఖడే స్టేడియంలో నేపాల్ - ఇటలీ మధ్య జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ సందర్భంగా నేపాల్ అభిమానుల సందడి ఆకాశాన్ని తాకింది. ఈ క్రేజ్‌ను ఆసరాగా చేసుకుని టికెట్లను భారీ ధరలకు బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. ఇప్పటికే నేపాల్ జట్టుకు సపోర్ట్ చేసేందుకు వేల సంఖ్యలో అభిమానులు నేపాల్ నుండి ముంబైకి చేరుకున్నారు.

 స్టేడియం బయట గేట్ల దగ్గర రూ.250 నుండి రూ.350ల టికెట్లను, బ్లాక్ మార్కెటర్లు రూ.500 పైనే అమ్ముతున్నారు. మ్యాచ్ చూసే ఆత్రుతలో అభిమానులు ఎంత ధరకైనా వాటిని కొనేస్తున్నారు.  ఈ ప్రపంచ కప్‌లో నేపాల్ జట్టు అద్భుతంగా ఆడుతోంది. గత మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టునే ఓడించినంత పని చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. 

అటు స్టేడియం లోపల, ఇటు బయట  గ్రౌండ్‌కు వెళ్లే దారిలో నేపాల్ అభిమానులు డప్పులు వాయిస్తూ, పోస్టర్లు పట్టుకుని  సందడి చేస్తున్నారు. ప్రతి బంతికీ డ్యాన్స్‌లు వేస్తూ వాంఖడే స్టేడియాన్ని ఒక పండగలా మార్చేశారు. ఒకప్పుడు చిన్న టీంగా ఉన్న నేపాల్, ఇప్పుడు  పర్ఫార్మెన్స్ తో భారత్‌లో కూడా భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకుంటోంది.