నోట్ల రద్దు.. ఇది ప్రతి ఇండియన్ మిడిల్ క్లాస్ వాడికి జీవితకాలం గుర్తుండిపోయే పీరియడ్. కరోనా లాక్ డౌన్ రేంజ్ లో జనం ఇబ్బంది ఎదుర్కున్నారంటే అది ఒక్క నోట్ల రద్దు సమయంలోనే అని చెప్పాలి. కేంద్రం ఆకస్మికంగా నోట్ల రద్దు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. ఏటీఎంల దగ్గర గంటల తరబడి క్యూలో నిలబడి చాలామంది ప్రాణాలు కూడా వదిలారు. 2017లో జరిగిన నోట్ల రద్దు గురించి ప్రస్తావన ఇప్పుడెందుకు అంటే.. అప్పట్లో నోట్ల రద్దుపై బీజేపీ ఎంపీ మనోజ్ తివారి చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దేశం కోసం అనగానే.. ఏటీఎంల దగ్గర క్యూలో నిలబడి వంద మందికి పైగా చచ్చారంటూ మనోజ్ తివారి అంటున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
మనోజ్ తివారి వ్యాఖ్యలపై ఓ రేంజ్ లో మండిపడుతున్నారు నెటిజన్స్.. ఇది బీజేపీ నాయకుల అసలు రూపం అని.. పైకి హిందుత్వం, దేశభక్తి అంటూ కలరింగ్ ఇచ్చే బీజేపీ నేతలకు సామాన్యులంటే లెక్కే లేదని అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. నోట్ల రద్దు సమయంలో మధ్యతరగతి జనం పడ్డ ఇబ్బందిని కామెడీ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.
During Demonetisation, several people lost their lives while standing in ATM queues.
— Roshan Rai (@RoshanKrRaii) February 10, 2026
The official death toll was more than a 100 people.
This is how BJP MP Manoj Tiwari mocked them and said these fools will do anything if we sell them nationalism. All other BJP leaders like… pic.twitter.com/ff8b766eN2
ఈ వీడియోలో మనోజ్ తివారీతో ఉన్న ఇతర బీజేపీ నేతలపై కూడా మండిపడుతున్నారు నెటిజన్స్. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోంటే అడ్డు చెప్పాల్సింది పోయి కోరస్ ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. నోట్ల రద్దు మధ్యతరగతి జీవితాల్లో పీడకల లాంటిదని.. ఈ వీడియోతో అది మళ్ళీ గుర్తు చేసారంటూ మరికొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
►ALSO READ | ముంబైలో నేపాల్ క్రికెట్ ఫీవర్: రూ.250 టికెట్ రూ.500 పైనే.. బ్లాక్ మార్కెట్ జోరు!
