మాదాపూర్, వెలుగు : మాదాపూర్ హైటెక్స్ వేదికగా నిర్వహించిన హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్ ఆదివారం ముగిసింది. లెర్నింగ్, ఇంటరాక్టివ్, అడ్వెంచర్ జోన్స్, టాలెంట్ షోస్, రోబోటిక్స్ వర్క్‌షాపులు, క్లైంబింగ్ వాల్ వంటి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
న్యూట్రిషన్, విద్య, లైఫ్ స్టైల్, బొమ్మలు, పుస్తకాలు, హాబీస్తదితర విభాగాలకు చెందిన అనేక ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించారు. చివరి రోజు చిన్నారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్టాల్స్ అన్నీ పిల్లలు, వారి తల్లిదండ్రులతో కిటకిటలాడాయి.
