రాబోయే రోజుల్లో బీజేపీదే అధికారం : మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు

 రాబోయే రోజుల్లో బీజేపీదే అధికారం : మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు
  • బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు 

సూర్యాపేట, వెలుగు:రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుందనడానికి పంచాయతీ ఎన్నికలే నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు, సూర్యాపేట ,పెన్‌‌పహాడ్, చివ్వెంల మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచి గెలుపొందిన సర్పంచులను, ఉపసర్పంచులను, వార్డు సభ్యులను మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.

 ఈ సందర్భంగా సంకినేని మాట్లాడుతూ..  బీజేపీ కేవలం పట్టణ పార్టీ అనే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి గ్రామీణ ప్రజలు బీజేపీ బలపరిచిన సర్పంచ్‌‌లను, వార్డు సభ్యులను గెలిపించారన్నారు.  రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎండీ అబిద్, మండల పార్టీ అధ్యక్షుడు సంద్యాల సైదులు, అలుగుబెల్లి సైదిరెడ్డి, మాధవరపు అనిల్, తాళ్లపల్లి మధు, జిల్లా కౌన్సిల్ సభ్యులు పేర్వాల లక్ష్మణరావు, పందిరి రామిరెడ్డి, ఉప్పు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.