గ్రామాభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం : ఎమ్మెల్యే మందుల సామెల్

గ్రామాభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం : ఎమ్మెల్యే మందుల సామెల్

తుంగతుర్తి, వెలుగు:  గ్రామ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమవుతుందని ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు.  ఆదివారం తిరుమలగిరి మండల కేంద్రంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇటీవల కాంగ్రెస్ పార్టీ సర్పంచులుగా గెలిచిన వారిని సన్మానించి మాట్లాడారు.  

సర్పంచులుగా గ్రామాల్లో మరింత బాధ్యతగా వ్యవహరించాలని, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందే విధంగా చూడాలన్నారు. గ్రామాల్లో సమస్యలను సర్పంచులు పర్యవేక్షిస్తూ సమస్యలను పరిష్కరించాలన్నారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మరింత ఉత్సాహంగా పని  చేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు.