ప్రభుత్వ విద్యా విధానాన్ని రక్షించుకోవాలి : మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

ప్రభుత్వ విద్యా విధానాన్ని రక్షించుకోవాలి : మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

తుంగతుర్తి, వెలుగు: ప్రభుత్వ విద్యా విధానాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ విస్తృత సాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడం ద్వారా మాత్రమే విద్యార్థుల్లో విద్యాభ్యాసం సరైన రీతిలో జరుగుతుందన్నారు.  రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ రాములు మాట్లాడుతూ.. 2023 జులై నుంచి అమలు కావాల్సిన పే రివిజన్ కమిషన్ రిపోర్టును వెంటనే ప్రకటించి అమలు చేయాలన్నారు. 

పెండింగ్‌‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు.  కేజీవీబీ ఉద్యోగులకు,  సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం బేసిక్ పే స్కేల్ అమలు చేయాలన్నారు. యూటీఎఫ్ ఉపాధ్యాయులు  సోమయ్య, ఎం రవీందర్, భీమిరెడ్డి సోమిరెడ్డి, జోగునేరి దేవరాజు, ఓరుగంటి అంతయ్య, సిరికొండ అనిల్ కుమార్,  జి.వెంకటేశం, వెంకటేశ్వర్లు, సూర్యప్రకాష్, నవీన్ శ్రీనివాస్, ఎల్లయ్య, ఆంజనేయులు, కమలమ్మ పాల్గొన్నారు.