గతంలో "పొద్దుటూరు దసరా" డాక్యుమెంటరీ రూపొందించి అందరి ప్రశంసలు అందుకున్నారు దర్శకుడు మురళీకృష్ణ తుమ్మ. "పొద్దుటూరు దసరా" డాక్యుమెంటరీ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా డైరెక్టర్ మురళీకృష్ణ తుమ్మ "నవాబుపేట దేవర" డాక్యుమెంటరీని రూపొందించారు. ఈ డాక్యుమెంటరీని బిందు ప్రియ, పూజ కృష్ణ తుమ్మ నిర్మించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ లో నవాబుపేట దేవర డాక్యుమెంటరీ ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నటుడు మహేశ్ విట్టా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా
యాక్టర్ మహేశ్ విట్టా మాట్లాడుతూ - మా రాయలసీమలో దేవర పండుగను ఇలాగే జరుపుతారు. డైరెక్టర్ మురళీ గతంలో పొద్దుటూరు దసరా అనే డాక్యుమెంటరీ చేశాడు. ఇప్పుడు నవాబుపేట దేవర డాక్యుమెంటరీ రూపొందించాడు. అతను సినిమా త్వరలో రూపొందించాలని కోరుకుంటున్నా. మన రాయలసీమ నేపథ్యంతో సినిమాలు చేసి చిత్ర పరిశ్రమలో ఎంతోమంది గొప్ప పేరు తెచ్చుకున్నారు. కానీ రాయలసీమ దర్శకులు మన కథల్ని తెరకెక్కించి ఆ స్థాయిలో పేరు తెచ్చుకోలేకపోతున్నారు. ఇంతవరకు రాయలసీమ నెటివిటీని సరిగ్గా చెప్పిన సినిమా రాలేదని నా ఉద్దేశం. ఇదే బ్యాక్ డ్రాప్ తో మురళీ సినిమా చేయాలని కోరుకుంటున్నా. ఈ డాక్యుమెంటరీ టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ చెబుతున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ శివప్రసాద్ మాట్లాడుతూ - చిన్నప్పటి నుంచి దేవర పండుగ జరిపే విధానం చూసేవాడిని. ఈ నేపథ్యంతో డాక్యుమెంటరీ చేస్తే బాగుంటుంది అనిపించింది. డైరెక్టర్ మురళీని అప్రోచ్ అయ్యాను. ఆయనకు గతంలో పొద్దుటూరు దసరా డాక్యుమెంటరీ చేసిన అనుభవం ఉంది. నవాబుపేట దేవర డాక్యుమెంటరీ ఇంత బాగా రావడానికి టీమ్ మెంబర్స్ అందరు చేసిన కృషి కారణం. ఈ జాతర జరిగిన రెండు రోజులు డైరెక్టర్ మురళీ ఎంత కష్టపడ్డాడో నేను కళ్లారా చూశాను. అన్ని పనులూ తనే చూసుకున్నాడు. నెక్ట్స్ మరో డాక్యుమెంటరీ కూడా ఆయన డైరెక్షన్ లో చేయబోతున్నాం. అన్నారు.
ప్రొడ్యూసర్ పూజ కృష్ణ తుమ్మ మాట్లాడుతూ - నవాబుపేట డాక్యుమెంటరీ చాలా బాగుంది. నాకు నచ్చింది. ఈ డాక్యుమెంటరీ ఔట్ పుట్ బాగా వచ్చింది. డైరెక్టర్ మురళీ, శివకు కంగ్రాట్స్. నేను కొంచెం సెన్సిటివ్. దేవుడి కోసం చేసిన జంతుబలి కాబట్టి జంతుబలి తప్పు కాదు. మన ఆచారంలో ఎప్పటినుంచో దేవుడికి జంతుబలి ఇవ్వడం ఉంది. ఈ టీమ్ ఇలాంటి మంచి డాక్యుమెంటరీలు మరిన్ని రూపొందించాలని కోరుకుంటున్నా. అన్నారు.
నవాబుపేట సర్పంచ్ పాతకోట సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ - మేము ఊహించిన దాని కంటే నవాబుపేట దేవర ఇంకా బాగుంది. పొద్దుటూరు దసరాను మించేలా ఆకట్టుకుంది. క్రియేటివ్ గా చూపించారు. మ్యూజిక్, సాంగ్స్ బాగున్నాయి. మా మురళీ, శివప్రసాద్ ఇలాంటి డాక్యుమెంటరీలు మరిన్ని రూపొందించాలని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ మురళీకృష్ణ తుమ్మ మాట్లాడుతూ - మా నవాబుపేట దేవర డాక్యుమెంటరీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం. నాకు డాక్యుమెంటరీస్ గురించి మొదట్లో పెద్దగా తెలియదు. ప్రొడ్యూసర్ ప్రేమ్ అవకాశం ఇచ్చి పొద్దుటూరు దసరా డాక్యుమెంటరీ చేసేలా సపోర్ట్ అందించారు. ఆ డాక్యుమెంటరీకి మంచి పేరొచ్చింది. ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ డాక్యుమెంటరీ సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తోనే నవాబుపేట దేవర రూపొందించాను. ఈ డాక్యుమెంటరీ ఇంత క్వాలిటీగా వచ్చిందంటే మా టీమ్ అందరి సపోర్ట్ వల్లే. లేకుంటే నేను 32 గంటల్లో కాదు ఇంక ఎంత టైమ్ ఇచ్చినా చేసేవాడిని కాదు. ఆనంద్ మ్యూజిక్, నాగేంద్ర లిరిక్స్ తో పాటు విజువల్స్ ఆకట్టుకుంటాయి. మా డీవోపీ ముంబైలో ఉండి రాలేకపోయారు. ఈ డా
