పీఓకేకు ఫ్లైట్లు రద్దు చేసిన పాక్ .. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం

పీఓకేకు ఫ్లైట్లు రద్దు చేసిన పాక్ .. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం

న్యూఢిల్లీ: భారత్​తో ఉద్రిక్తతలు పెరగడంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)కు పాకిస్తాన్ అన్ని విమాన సర్వీసులను రద్దు చేసింది. పీఓకేలోని గిల్గిత్‌‌, స్కర్దు ప్రాంతాలకు విమాన సర్వీసులను పాకిస్తాన్ ఇంటర్నేషనల్‌‌ ఎయిర్‌‌లైన్స్‌‌ (పీఐఏ) రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ నుంచి పీఓకేలోని స్కర్దుకు వెళ్లే అన్ని విమాన సర్వీసులు పీఐఏ రద్దు చేసిందని స్థానిక మీడియా తెలిపింది. ఇస్లామాబాద్ నుండి గిల్గిత్​కు వెళ్లే మరో నాలుగు విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయని పేర్కొంది. 

జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. వీటితో పాటు స్థానికంగా అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్‌‌ ప్రకటించారు. పహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో భారత్‌‌– -పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆ దేశం విమాన సర్వీసులను రద్దు చేసింది.