0.3 శాతం క్షీణించిన యూఎస్ జీడీపీ

0.3 శాతం క్షీణించిన యూఎస్ జీడీపీ

న్యూఢిల్లీ: యూఎస్ జీడీపీ ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌‌‌‌లో 0.3 శాతం క్షీణించింది. ట్రంప్ టారిఫ్ వార్ మొదలు పెట్టడంతో వ్యాపారులు భారీగా దిగుమతులు చేపట్టారు. ఫలితంగా యూఎస్ ట్రేడ్ డెఫిసిట్  పెరిగిందని, జీడీపీ క్షీణించిందని ఎనలిస్టులు పేర్కొన్నారు.  కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌లో జీడీపీ 2.4 శాతం వృద్ధి చెందింది. 

ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌లో  జీడీపీ 0.3 శాతం పెరుగుతుందని ఎనలిస్టులు అంచనా వేశారు. అమెరికా దిగుమతులు మార్చి  క్వార్టర్‌‌‌‌లో ఏడాది లెక్కన 41.3 శాతం పెరిగాయి.  యూఎస్ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో కదిలాయి.