Hit3 X Review: హిట్ 3 X రివ్యూ.. నాని మూవీకి పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

Hit3 X Review: హిట్ 3 X రివ్యూ.. నాని మూవీకి పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

నాని హీరోగా నటించిన లేటెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'హిట్ 3: ది థర్డ్ కేస్. డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ మూవీ నేడు (2025 మే 1న) థియేటర్లలో విడుదలైంది. సూపర్ సక్సెస్ అయిన హిట్ ఫ్రాంచైజీలో మూడో మూవీగా ఇది తెరకెక్కింది. ఈ మూవీని వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా నిర్మించారు.

ఈ మూవీ ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ (ఏప్రిల్ 30న) పూర్త‌య్యాయి. ప్రీమియర్ల తర్వాత అక్కడీ ఆడియన్స్ అండ్ నెటిజన్లు వెల్లడించిన అభిప్రాయాలు X (గతంలో ట్విట్టర్) రివ్యూలో చూద్దాం. 

'హిట్ 3' మూవీ ఒక వయలెంట్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్. అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని విశ్వరూపం చూపించినట్లు అమెరికాలో మూవీ చూసిన నెటిజన్లు చెబుతున్నారు. సినిమాలో నాని పాత్రను పరిచయం చేసిన తీరు అదిరిందని, ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్ వరకు‌ సినిమా వైల్డ్ మోడ్లో ఉంటుందని, ఇక ఆ ఆతర్వాత వచ్చే ఇంటర్వెల్ మాస్ సంభవం అని నెటిజన్స్ ట్వీట్లు చేస్తున్నారు. 

యాక్ష‌న్ ఎపిసోడ్స్‌తో నాని ఇర‌గ‌దీశాడ‌ని, ఒక్కో ఫైట్ సీక్వెన్స్ ఒక్కో క్లైమాక్స్‌లా ఉంటుంద‌ని, అయితే, మూవీలో వ‌య‌లెంట్ ఎక్కువ ఉండటంతో స్క్రీన్‌పై ర‌క్తం ఏరులైపారుతుంద‌ని  చెబుతోన్నారు. నాని ముందస్తు ప్ర‌మోష‌న్స్‌లో చెప్పిన‌ట్లు పిల్ల‌లు, ఫ్యామిలీస్ సినిమాకి దూరంగా ఉండాలి చెప్పినట్లుగానే ఉందని అంటున్నారు. ఎందుకంటే, సినిమాలోని ర‌క్త‌పాతం, హింస‌ను వారు త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మేన‌ని, అంతేగాకుండా బోల్డ్ డైలాగ్స్ కూడా సినిమాలో ఎక్కువేని నెటిజన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. అయితే, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ పోర్షన్స్ సూపర్గా వర్కౌట్ అయ్యాయని ఆడియన్స్ చెబుతున్నారు.

ఓ నెటిజన్ X లో స్పందిస్తూ.. "హిట్ 3 మూవీ చాలా వ‌య‌లెంట్ యాక్షన్ క్రైమ్ థ్రిల్ల‌ర్. ఇందులో వచ్చే ప్రతి సీన్ బాగా వర్కౌట్ అయింది. కానీ అదే సమయంలో కథ  నెమ్మదిగా వెళ్లిన ఫీలింగ్ కలిగిస్తోంది. ఫస్టాఫ్ చాలా వరకు యావరేజ్‌గా ఉంది. అలాగే, ప్రీ-ఇంటర్వెల్ వరకు కథ ఊహించదగినదిగా ఉంది. అక్కడి నుండి సినిమా ఎంగేజ్ అవ్వడం ప్రారంభిస్తుంది. సెకండాఫ్ లో కొరియన్ సిరీస్ స్క్విడ్ గేమ్ నుంచి కొన్ని సీన్స్ కాపీలా ఉంటాయి.

ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు హై ఇచ్చే సీన్స్ అదిరిపోయాయి. అయితే, ఇక్కడ కూడా రచన ఊహించదగినదిగా ఉంది. ట్విస్టులు తక్కువ ఉండటంతో మాస్ మూమెంట్స్ పై ప్రేక్షకులు ఎక్కువ ఆధారపడాల్సి ఉంటుంది. నిర్మాణ విలువలు మరియు సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా నిలుస్తాయి. సంగీతం అసమర్థంగా ఉంది మరియు అన్ని పాటలు స్పీడ్ బ్రేకర్లుగా ఉన్నాయని" నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరో నెటిజన్ స్పందిస్తూ.. ' ఫస్టాఫ్ లో లవ్ ట్రాక్ తప్ప మిగతావన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. సెకండాఫ్ పూర్తిగా భిన్నమైన దిశలో వెళుతుంది. వ‌య‌లెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ గా స్క్రీన్ రక్తసిక్తం చేయడంతో కొంతవరకు చూడదగ్గదిగా ఉంది.

అయితే, నాని అద్భుతంగా నటించాడు. తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఇది పిల్లలు మరియు కుటుంబాల కోసం కాదని నాని చెప్పింది నిజమే. రక్తపాతం మరియు బోల్డ్ డైలాగ్స్ తో నిండిన హింసాత్మక చిత్రం ఇదని" X లో తన రివ్యూని పంచుకున్నాడు.

మరో నెటిజన్ ట్వీట్ చేస్తూ.. " ‘హిట్‌‌ : ది థర్డ్ కేస్‌‌’ మూవీ సూపర్బ్. నాకు నచ్చింది. సూపర్ సక్సెస్ అయిన హిట్ ఫ్రాంచైజీలో మూడో మూవీగా వచ్చింది ఇది. అయితే, మొదటి 2 కేసుల మాదిరిగా సీట్ ఆఫ్ సీట్ థ్రిల్లర్ కాదు. ఇది యాక్షన్ మరియు హింసాత్మక సన్నివేశాలతో కూడిన ఇన్వెస్టిగేషన్ పై ఎక్కువగా ఆధారపడుతుంది. అవి చాలా సాలిడ్!

నాని వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. క్యామియోలు వర్కౌట్ అయ్యాయి. మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. విజువల్స్ సూపర్బ్ గా ఉన్నాయని" నెటిజన్ ట్వీట్ చేశాడు.