
కేరళ రాష్ట్రంలో సంచలనం.. ఎండాకాలం సెలవుల్లో.. ఇంట్లో చక్కగా స్మార్ట్ టీవీలో సినిమాలు చూస్తున్న సమయంలో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. కేరళ రాష్ట్రం కల్పేటలోని అంబిలేరిలో ఈ ఘటన జరిగిరింది. ఇంట్లోని స్మార్ట్ టీవీ.. బాంబు పేలినట్లు పేలిపోవటంపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సాజిన్, ఇమ్మాన్యుయేల్.. ఇద్దరూ అన్నదమ్ములు. ఇంట్లో స్మార్ట్ టీవీలో సినిమాలు చూస్తు్న్నారు. అకస్మాత్తుగా టీవీ నుంచి మొదట పొగ వచ్చింది. టీవీ వెనకాల నుంచి చిన్నగా మంట రవ్వలు రావటాన్ని గమనించారు పిల్లలు. దీంతో టీవీకి ఉన్న కరెంట్ స్విచ్ ఆఫ్ చేయటానికి ప్రయత్నిస్తున్న సమయంలో.. టీవీ ఒక్కసారిగా పేలిపోయింది. పెద్ద శబ్ధంతో స్మార్ట్ టీవీ పేలిపోయింది. ఈ ఘటనలో టీవీ కరెంట్ స్విచ్ ఆఫ్ చేయటానికి ప్రయత్నించిన 14 ఏళ్ల బాలుడు సాజిన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.
►ALSO READ | OMG : మిషా అగర్వాల్ ఆత్మహత్య చేసుకున్నది.. ఇన్ స్ట్రా ఫాలోవర్స్ తగ్గటం వల్ల అంట..!
ఆ వెంటనే ఇంట్లోని కుటుంబ సభ్యులు పిల్లలను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. స్మార్ట్ టీవీ పేలటంతో ఇంట్లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే స్మార్ట్ టీవీ పేలి ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. స్మార్ట్ టీవీని పరిశీలించిన తర్వాతనే ఫైనల్ రిపోర్ట్ ఇస్తామన్నారు అగ్నిమాపక సిబ్బంది. స్మార్ట్ టీవీని కూడా పరిశీలన కోసం తీసుకెళ్లారు.
స్మార్ట్ టీవీ పేలిన శబ్ధం మాత్రం చాలా ఎక్కువగా ఉందని.. బాంబు పేలినట్లు పేలిన శబ్ధం వచ్చిందని చుట్టుపక్కల ఇళ్ల వారు చెబుతున్నారు. గాయపడిన చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని.. కాలిన గాయాలకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు డాక్టర్లు.