ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (డీఎస్ఎస్ఎస్బీ) స్టెనో, అసిస్టెంట్ మేనేజర్, రేడియోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్థులు అర్హులు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 27న ప్రారంభమై మార్చి 28న ముగుస్తుంది.
ఖాళీలు: 216.
విభాగాల వారీగా ఖాళీలు: అసిస్టెంట్ మేనేజర్ (టూరిజం) 6, అసిస్టెంట్ మేనేజర్ (జనరల్) 6, అసిస్టెంట్ మేనేజర్ (అకౌంట్స్) 3, అసిస్టెంట్ మేనేజర్ (లీగల్) 1, అసిస్టెంట్ మేనేజర్ (ఎయిర్ టికెటింగ్) 1, అసిస్టెంట్ మేనేజర్ (పబ్లిక్ రిలేషన్) 1, అసిస్టెంట్ గ్రేడ్ – I (ఐటీ) 6, రేడియోగ్రాఫర్ 96, ఆప్టోమెట్రిస్ట్ 6, జూనియర్ రేడియోగ్రాఫర్ 10, మీటర్ & రిలే టెస్టర్ గ్రేడ్ -– II 34, రిపోర్టర్ 10, కటిబ్ (కాలిగ్రాఫర్) 1, పట్వారీ 15, జూనియర్ లా ఆఫీసర్ 1, కెమికల్ అసిస్టెంట్ 2, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – I 3, జూనియర్ లేబొరేటరీ అసిస్టెంట్2, బుక్ బైండర్ 2, అసిస్టెంట్ మైక్రోఫోటోగ్రాఫిస్ట్ 1.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు/ సంస్థ నుంచి పదోతరగతి, 12వ తరగతి, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. పోస్టులను అనుసరించి వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. కాబట్టి నిర్దిష్ట నోటిఫికేషన్ చూడగలరు.
వయోపరిమితి: 18 నుంచి 32 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 27.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికులకు, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఇతరులకు రూ.100.
లాస్ట్ డేట్: మార్చి 28.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ ఫిజికల్ ఎండ్యురెన్స్ టెస్ట్/ డ్రైవింగ్ టెస్ట్/ ట్రేడ్ టెస్టు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు dsssb.delhi.gov.in వెబ్సైట్ను సందర్శించండి.
