సింగరేణి కుంభకోణాలపై సీబీఐతో విచారణ జరిపించాలి

సింగరేణి కుంభకోణాలపై సీబీఐతో విచారణ జరిపించాలి

ఖమ్మం టౌన్, వెలుగు: సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలపై సీబీఐతో విచారణ జరిపించాలని, వాటాలు పంచుకుంటున్న అధికారులు, ప్రజాప్రతినిధులను అరెస్ట్  చేయాలని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్  రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్  డిమాండ్  చేశారు. 

ఖమ్మంలోని పార్టీ ఆఫీస్ లో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఏపీ కాంట్రాక్టర్ల పెత్తనం, అధికారుల చేతివాటం పెరగడంతో సింగరేణి మనుగడ దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తనాల వ్యవహారం తారాస్థాయికి చేరుకుందని తెలిపారు. 

రైతులకు అండగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 26న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం,- నల్గొండ, -వరంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. షేక్  జానీ మహమ్మద్, మోత్కూరి వెంకటేశ్వరచారి, పి. వీరప్ప, ఎన్. నర్సింహారావు పాల్గొన్నారు.