ప్రేమలో మోసపోయానంటూ ‘ఒక కోర్టు కేస్’

ప్రేమలో మోసపోయానంటూ ‘ఒక కోర్టు కేస్’

ప్రేమలో మోసపోయిన ఓ యువకుడు న్యాయం కోరుతూ కోర్టును ఆశ్రయించడం అనే వినూత్న కథాంశంతో వస్తున్న చిత్రం ‘ఒక కోర్టు కేస్’. సూర్యాన్ష్, తనిషా మిశ్రా జంటగా నటించగా థర్టీ ఇయర్స్ పృథ్వి, సత్యకృష్ణ, దయానంద్, ముక్తార్ ఇతర పాత్రలు పోషించారు.

గణేష్ పూడి దర్శకనిర్మాతగా తెరకెక్కించిన ఈ చిత్రం జులై 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో టీజర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. టీజర్‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించిన నటుడు శ్రీకాంత్‌‌‌‌.. ‘ప్రేమలో జరిగే సంఘటనలను లీగల్ డ్రామాగా మలచడం ఆసక్తికరంగా ఉంది’ అంటూ టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.

దర్శక నిర్మాత గణేష్ పూడి మాట్లాడుతూ ‘ప్రేమలో మోసపోయిన వ్యక్తి చేసే న్యాయ పోరాటాన్ని ఎమోషనల్‌‌‌‌, ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్‌‌‌‌తో కూడిన లీగల్‌‌‌‌ డ్రామాగా తెరకెక్కించాం. బ్రేకప్ తర్వాత జరిగే రివేంజ్‌‌‌‌ అనే అంశం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది’ అని చెప్పారు. తమ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది ప్రత్యేకమైన చిత్రమని హీరోహీరోయిన్స్‌‌‌‌ సూర్యాన్ష్‌‌‌‌, తనిషా మిశ్రా చెప్పారు.