కాశీబుగ్గ (కార్పొరేషన్), వెలుగు: గ్రేటర్ వరంగల్లో శానిటేషన్ పని తీరును చైన్నై ప్రతినిధుల బృందం మంగళవారం పరిశీలించింది. అనంతరం బల్దియా మేయర్ గుండు సుధారాణి తన ఛాంబర్లో తమిళనాడు ప్రతినిధుల బృందానికి శానిటేషన్ విధానాలను వివరించారు. ఈ సందర్భంగా బల్దియా శానిటేషన్ నిర్వహణను బృందం ప్రశంసించారు. ఎఫ్ఎస్టీపీల నిర్వహణ, వ్యర్థాలను మెన్యూర్(ఎరువు)గా మార్చే ప్రక్రియ, హాజ్ హాల్డ్స్డి-స్లడ్జింగ్ పద్ధతులు, బల్దియా ప్రయోగాత్మకంగా 53వ డివిజన్ ఆదర్వ కాలనీలో ప్రారంభించిన సెప్టిక్ ట్యాంక్ క్లినింగ్ ప్రక్రియ గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం చైన్నై ప్రతినిధుల బృందాన్ని బల్దియా మేయర్ ఘనంగా సత్కారించారు. కార్యక్రమంలో బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, తమిళనాడు మేయర్, ప్రతినిధులు, ఆరోగ్యాధికారి డాక్టర్ రాజేశ్, ఆస్కి ప్రతినిధులు, తమిళనాడు మున్సిపల్ ఆఫీసర్లు తదితరులున్నారు.