జీడిమెట్ల, వెలుగు: గంజాయి మత్తులో ఓ పాత యువకుడు కత్తి పట్టుకుని వీరంగం సృష్టించాడు. పలువురిని గాయపరిచి నానా హంగామా సృష్టించాడు. పోలీసులు తెలిపిన ప్రకారం... సూరారం దయానంద్నగర్కు చెందిన రవి(25)పై పలు దొంగతనాల కేసులున్నాయి. ఆదివారం రాత్రి గంజాయి తాగి వచ్చి కాలనీలో హల్చల్ చేశాడు. ఇంటిపక్కన ఉన్న ఓ వ్యక్తిపై దాడిచేశాడు. అక్కడే పక్కనున్న మరో ఇద్దరు బిహార్ యువకులపై కత్తులతో దాడి చేయగా వారి తలలకు గాయాలయ్యాయి. బాధితుడు కన్నాసింగ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
