గచ్చిబౌలిలో ఫామ్ హౌస్ లో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్ట్.. 

గచ్చిబౌలిలో ఫామ్ హౌస్ లో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్ట్.. 

హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఫామ్ హౌస్ లో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు ఎస్ఓటీ పోలీసులు. మంగళవారం ( మార్చి 10 ) గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో ఫామ్ హౌస్ ఆకస్మిక దాడులు నిర్వహించారు ఎస్ ఓటీ పోలీసులు. ఫామ్ హౌస్ ప్రాంగణంలో రహస్యంగా గంజాయి సాగు చేస్తున్న వాచ్ మెన్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఉత్తరప్రదేశ్ కి చెందిన మాతా బాదల్ ఫామ్ హౌస్ కి వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. గత కొంతకాలంగా ఫామ్ హౌస్ ప్రాంగణంలో రహస్యంగా గంజాయి మొక్కను పెంచుతున్నాడు మాతా బాదల్. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఫామ్ హౌస్ పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. 

►ALSO READ | హైదరాబాద్లో హోటల్స్ బంద్పై తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ క్లారిటీ

ఈ దాడిలో మాతా బాదల్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతని దగ్గర నుంచి 272 గ్రాముల గంజాయి మొక్కను, ఒక మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై SDPS చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు