కుత్బుల్లాపూర్: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫాక్ సాగర్ చెరువులో బుధవారం చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి గల్లంతైయ్యాడు. సెప్టెంబర్ 4న సాయంత్రం ముగ్గురు వ్యక్తులు చేపల వేటకు వెళ్లారు. రోడ మేస్త్రి నగర్ చెందిన షఫీర్ చేపలు పడుతూ ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. దీంతో భయాందోళనకు గురైన ఇద్దరు స్నేహితులు అక్కడి నుంచి వచ్చి బాధితుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
రాత్రి చెరువులో షఫీర్ ను వెతకడం వీలు కాలేదు. ఫాక్ సాగర్ చెరువులో గురువారం ఉదయం నుండి బోటు సహాయంతో షఫీర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. షబ్బీర్ జీడిమెట్లలో ఫాబ్రికటర్ గా పనిచేస్తుంటాడని అతనికి నలుగురు ఆడపిల్లలు ఉన్నారని బంధువులు తెలిపారు. పేట్ బషీరాబాద్ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.