అత్తాపూర్​లో ఒకరి దారుణ హత్య..

అత్తాపూర్​లో ఒకరి దారుణ హత్య..

హైదరాబాద్ లో మరో హత్య కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని అత్తాపూర్ పోలీస్​స్టేషన్​ పరిధి సులేమాన్​నగర్​లో ఖలీల్​(30) నివసిస్తున్నాడు. జులై ​1న రాత్రి ఖలీల్​ తన స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. ఈ క్రమంలో స్నేహితులు తమ వెంట తెచ్చుకున్న కత్తితో ఖలీల్​పై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.  మృతదేహాన్ని  పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.