ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలకేంద్రంలో బ్రాండెడ్ బీర్లు దొరకడం లేదని మద్యంప్రియులు సోమవారం ఆందోళన చేశారు. ముల్కనూర్ రోడ్డులోని కాసా వైన్స్ షెటర్లను మూసేసి నిరసన తెలిపారు.
ఎల్కతుర్తిలో కొద్ది రోజులుగా ప్రముఖ బ్రాండెడ్ బీర్లను కేవలం బెల్టుషాపులకు పంపిస్తూ.. వైన్‌షాపుల్లో అందుబాటులో ఉంచడం లేదని వారు ఆరోపించారు. ఉత్పత్తి తగ్గిందని చెబుతూ బ్రాండెడ్ బీర్లకు బదులుగా నాసిరకం బ్రాండ్లు అమ్ముతున్నారని చెప్పారు. వేసవి రాకముందే పరిస్థితి ఇలా ఉండడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను సర్దిచెప్పి పంపించారు
