V6 News

శంకర్ పల్లిలో ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన ట్యాంకర్

శంకర్ పల్లిలో ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన ట్యాంకర్

రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంకర్పల్లి మండల పరిధిలోని జనవాడ వద్ద యూటర్న్ తీసుకుంటున్న ఒక ట్యాంకర్, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును అత్యంత బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.ఈ ఘోర ప్రమాదంలో బస్సు డ్రైవర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టినప్పటికీ, డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదానికి ట్యాంకర్ డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ట్యాంకర్ మాఫియా ఆగడాల వల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి, ట్యాంకర్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.