విద్యాశాఖ ఇన్చార్జిసెక్రటరీగా శ్రీదేవసేన..సెలవుపై వెళ్లిన యోగితారాణా 

విద్యాశాఖ ఇన్చార్జిసెక్రటరీగా శ్రీదేవసేన..సెలవుపై వెళ్లిన యోగితారాణా 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విద్యాశాఖ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి సెక్రటరీగా ఐఏఎస్  ఆఫీసర్ ఏ.శ్రీదేవసేన నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న డాక్టర్ యోగితారాణా వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్లడంతో ఆ స్థానంలో శ్రీదేవసేనకు ప్రభుత్వం అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు.