వరద బీభత్సానికి కొట్టుకుపోతున్న దుకాణాలు

వరద బీభత్సానికి కొట్టుకుపోతున్న దుకాణాలు

గత కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని స్థాయిలో వరదలు సంభంవించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. క్లౌడ్ బరస్ట్ కారణంగా తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లులో భవనాలు, దుకాణాలు కొట్టుకుపోయాయని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా, మండి జిల్లాలో గురువారం ఉదయం కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారిని దిగ్బంధించినట్లు ఆ శాఖ తెలిపింది. ఈ కారణంగా జాతీయ రహదారి-21 ని పూర్తిగా మూసివేశామని ఆ జిల్లా ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (DEOC) తెలిపింది. 

హిమాచల్ ప్రదేశ్ లో అకస్మాత్తుగా వచ్చిన వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్లౌడ్ బరస్ట్ కారణంగానే హిమాచల్ ప్రదేవ్లోని మనాలిలో భారీ వర్షాలు, వరదలు పోటెత్తాయని అధికారులు ఇప్పటికే వెల్లడించారు. అయితే భారీ వర్షాలు, వరదల వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.