ప్రారంభించిన జిల్లా అడిషనల్ కలెక్టర్ శామీర్ పేట, వెలుగు: సీనియర్ సిటిజన్స్ పోషణ, ఫిర్యాదుల కోసం మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అభిషేక్ అగస్త్య మంగళవారం ఓ వెబ్ సైట్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరాధారణకు గురై పోషణ కోసం ఇబ్బందులు పడే వృద్ధులు వారి సమస్యలపై TS senior citizens CCG.gov.in వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు.
ఈ వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేస్తే, సమస్యను పరిశీలించి, వారికి త్వరగా న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీడీపీవో పావని, ముత్యాలు, తహసీల్దార్ శరత్ కుమార్ పాల్గొన్నారు.
