అక్కడ ఆధార్ చూపిస్తేనే పానీపూరీ

అక్కడ ఆధార్ చూపిస్తేనే పానీపూరీ

సాధారణంగా పానీపూరీ అంటే ఇష్టపడని వారుండరు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు పానీపూరీ అంటే లొట్టలేసుకుంటూ తినేస్తారు. నగరాల్లో అయితే ఈ స్ట్రీట్ ఫుడ్‭కి మంచి క్రేజ్ ఉంది. దీనిని అమ్మే బండ్లు సిటీల్లో అయితే వీధికి ఒకటి, రెండు కనిపిస్తాయి. అయితే.. పానీపూరీ తినాలంటే ఆధార్ కార్డు చూపించాలి అంటూ మధ్యప్రదేశ్‭లోని గ్వాలియర్ బింద్ రోడ్డులో భగత్ జీ అనే పానీపూరీ బండి ఓనర్ చోటేలాల్ కండీషన్ పెట్టాడు. అక్కడ ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఎవరికి అయినా పానీపూరీ ఇస్తాడు.

ఛోటేలాల్ నడిపే పానీపూరీ బండికి అక్కడ మంచి పేరు ఉంది. దీంతో ఎక్కడెక్కడి నుంచో పానీపూరీ తినడానికి అక్కడికి చాలామంది వస్తుంటారు. అయితే అతను పానీపూరీలో వాడే నీళ్లలో చాలా ఘాటైన చాట్ మసాలా ఉంటుంది. ఇది పిల్లలు, పెద్దలు అందరికీ అంత మంచిది కాదట. అందుకే తన దగ్గరికి వచ్చే వారి వద్ద ఆధార్ కార్డు చెక్ చేసి.. అందులో 18 నుంచి 50 ఏళ్లలోపు వయస్సు ఉన్న వాళ్లకే అతడు పానీపూరీ అమ్ముతూ ఉంటాడు. ఇదే విషయాన్ని తన ఛాట్ బండి పై కూడా రాశాడు. అయితే.. ఈ ఛోటేలాల్ గత ఇరవై ఏళ్లుగా పానీపూరీ విక్రయిస్తున్నాడు.