విధి రాతను మార్చలేరు : ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రికి వస్తే.. చెట్టు విరిగి పడి వ్యక్తి మృతి

విధి రాతను మార్చలేరు : ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రికి వస్తే.. చెట్టు విరిగి పడి వ్యక్తి మృతి

విధి రాతను ఎవ్వరూ మార్చలేరు.. ఎన్నడూ చెరపలేరు.. ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాం హమ్మయా అని ఊపిరి పీల్చేలోపే గుండు సుదీ గుచ్చుకోనైనా మనిషి చనిపోతుండవచ్చు. అంతే ఎవ్వరూ ఈలోకంలో గ్యారెంటీ కార్డు రాసుకుని రాలేదనే దానకి రోజుకో ఉదాహరణ మన ముందే కనిపిస్తుంది. ఎక్కడో ఓ చోటో ఎదో విధంగా... మనిషి చావుతో ప్రతి క్షణం పోరాటం చేస్తునే ఉన్నాడు..

అవును మరీ.. ఆరోగ్యం బాగోలేదని ఆస్పత్రికి వస్తే.. మరో ప్రమాదం వచ్చి చనిపోతామని ఎవరనుకుంటారు.. అది కూడా చెట్టు కొమ్మ విరిగి తమ మీదే పడుతుందని కలనైనా కంటారా.. అసలు చెవినైనా వింటారా.. ఇదే ఘటన జరిగింది ఓ చోట అది మరెక్కడో కాదు..

హైదరాబాద్ లోని బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. కంటోన్మెంట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వచ్చిన దంపతులపై ఆస్పత్రి ఆవరణలో ఉన్న భారీ వృక్షం విరిగి పడింది. ఈ ప్రమాదంలో భర్త రవీందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో సరళ దేవికి సైతం తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిగా మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్ లో గాంధీ ఆస్పత్రికి తరలించారు.

సరళ దేవి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం గాంధీ ఆసుపత్రికి తరలించారు.   పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఈ ఘటన మూలంగా ఆసుపత్రికి వచ్చిన వారంతా ఆందోళన గురయ్యారు.