అప్పు జీవితాలు : ఐ ఫోన్లు, కార్లు EMIలతోనే కొంటున్నారు.. 80 శాతం మంది

అప్పు జీవితాలు : ఐ ఫోన్లు, కార్లు EMIలతోనే కొంటున్నారు.. 80 శాతం మంది

కార్లు, ఐఫోన్లు ఇవన్నీ.. అవి వాడుతున్నవారి స్టేటస్ చూపిస్తాయి. విలువైన వస్తువులే మనుషులు విలువ పెంచుతాయంటే అందులో తప్పేం లేదు. ఇప్పుడు అదే జరుగుతుంది. రిచ్ ఫోన్లు, కార్లు ఉంటే సమాజంలో మంచి రెస్పెక్ట్ లేదంటే తక్కువ చేసి మాట్లాడుతారు. సంపాదన తక్కువ.. ఖరీదైన ఫోన్లు, కార్లు కొనాలంటే ఎలా? ఒకప్పుడంటే అది కుదరని పని.. ఇప్పుడు జేబులో సరిపడా డబ్బు లేకుండా షోరూంకి వెళ్లి ఏది కావాలంటే అది తెచ్చుకోవచ్చు. ఎలాగంటారా.. అదే ఈఏంఐ ప్లాన్.. ఈరోజుల్లో గ్యాస్ స్టౌ లేని ఇల్లు అయినా ఉంటుందేమో గాని ఈఎంఐ కట్టని కుటుంబం ఉండట్లేదు. కనీసం ఇంట్లో ఒకరో ఒకరు EMI పద్దతిలో వస్తువులు కొంటున్నారు.

ప్రస్తుత రోజుల్లో కాలేజ్‌కి వెళ్లే స్టూడెంట్స్ కూడా వాళ్ల పాకెట్ మనీతో ఐ ఫోన్స్ కొంటున్నారు. ఇంట్లో ఖర్చులకు ఇచ్చే డబ్బుతో నెలవారీ వాయిదాలు కడుతున్నారు. ఇలా ఐఫోన్స్ కు ఎందుకింత డిమాండ్ పెరిగిందంటే, దానికున్న బ్రాండ్ ఇమేజ్, సెక్యూరిటీ, ఫ్యూచర్స్ అనే చెప్పాలి.  ఐ ఫోన్14 మోడల్ కొనాలంటే స్టార్టింగ్ ఈఎంఐ రూ.9,404, బెసిక్ మెడల్ కొనాలంటే రూ.3000 ఉంది. దీనికి తోడు ఈ కామర్స్ ఇచ్చే ఆఫర్స్, ఈసీ ఈఎంఐ ప్లాన్స్ ఆ ఫోన్లు విపరీతంగా కొనడానికి కారణం. కార్లు కూడా ఇలానే ఎక్కువగా కొంటున్నారు. ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ లో షాపింగ్ చేయడంపై ఆర్థికవేత్తలు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా EMI మిడిల్ క్లాస్, పూర్  ఫ్యామిలీస్ కు ఆర్థిక భారమే. 

నెలకు ఇంతని కట్టుకుంటూ ఎంత ఖరీదైనా వస్తువైనా కొనొచ్చు. కానీ సరిగ్గా నెలకు ఆ ఈఎంఐ కట్టాలి, లేదంటా చెక్ బౌన్స్ అని, వడ్డీ అని కట్టాల్సినదానికన్నా ఎక్కువ కట్టాలి. ఇదే ఈఎంఐ అసలు రూపం.. ఇటీవల ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇండియాలో 70 శాతం కార్లు, ఐఫోన్లు ఈఎంఐ ప్లాన్స్ తో కొన్నవేనంట. ఇండియాలో  ఆపిల్ ప్రాడక్ట్స్ 2022 ఆర్థిక సంవత్సరంలో 45 శాతం సాధించి, USD 4 బిలియన్లు (33వేల కోట్లు)కు చేరుకుంది.  2022 క్యూ 4లో ఎక్కువ ఐఫోన్లు అమ్ముడుపోయాయని యాపిల్ సీఈఓ టిక్ కుక్ ప్రకటించాడు.